పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

ఆమెరికా సంయుక్త రాష్ట్రములు


{ఆంగ్ల ప్రభుత్వము
అమెరికనులను
చీలదీయుట}

మగు సుపన్యాసములో అమెరికనులు స్వతంత్రమును పొందుటకు యుద్దము చేయుచున్నారనియు వారిని జయించి లోబరచుకొనుటకు ఆంగ్లేయ, ప్రభుత్వము నిశ్చయించినదనియు నుడి వెను. పార్ల మెంటులోని కొందరు ప్రముఖులగు సభ్యులు ఆమేరికా వారి తో సంధి చేసుకొనవలెనని చెప్పిరి. టోకాని యెక్కువమంది సభ్యులును రాజును మంత్రులను అమెరికా వారి యవిధేయతకు బుద్ధివచ్చునట్లు శిక్షించవలెననియే పట్టుదలను చూపిరి, ఆంగ్ల దేశములోని చాలమంది ప్రజలును రాజు పరముననేయుండిరి. అమెరికాలోని తిరుగబాటు సణచివేయుటకై రావలసిన సైస్వములను బంపుటకును ఈయుద్దమున కవసరమగు వ్రయము చేయుటకుమ మంత్రుల కధికార మొసంగబడెను. ఆమెరిగా లోని పదమూడు రాష్ట్రములతోను నెట్టివర్తకము జరుప గూడదని పార్లమెంటునారు చట్టమును చేసిరి. గాని ఏరాష్ట్ర మునుగాని లేక రాష్ట్రములోని కొంత మంది ప్రజలుగాని ఆం గ్లేయులతో సఖ్యముగ నుండునట్లాడంబడి యెడల వారిమీద యుద్ధము చేయమనికూడ ప్రకటించి ఇట్లు ఆంగ్లేయులతో చేరు వారిని ప్రోత్సహించుటకై కమీషనరులను బంపిరి. ఇది అమెరికాలోని ప్రజలను చీలదీయుటకై యుద్దేశింవబడిపపన్నుగడ. అమెరికాలో కూడ పెనిసిల్వానియా, న్యూజర్నీ, డెలవేరు, మే రీలాండు, అనునాలుగు రాష్ట్రములకును ఆంగ్లేయరాజ్యముతో విడిపోవుటకింక సుయిష్టము లేకుండెను.