పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆరవ ఆధ్యాయము

93


కొని వారిని మాథ్యములో ముంచి మత స్వేచ్ఛను పూర్తిగా తీసి వేసినారు. ఈ సిద్ధాంతములు కేవలము. స్వార్ధ పరులచే కల్పింపబడినవి ” అని విమర్శించెను. "దేశము ప్రజలది. ప్రజలు మొదట ప్రభుత్వములు లేక ఎవరీయిష్టము వచ్చిన విధ మున వారు ప్రవర్తింపుచు సంపూర్ణ స్వేచ్చము కలిగియుండిరి. కాని కలహములు కలుగు చుండెను. శాంతి కలిగి యుండుటకై ప్రజలందరును కలిసి ప్రభుత్వముల నేర్పరచుకొనిరి. రాజులు గాని మరి ఏప్రభుత్వము : గానీ ప్రజలేర్పరచుకొనగ వచ్చిన వారు. ప్రజల లాభమసకై ఏర్పడినవారు. ప్రజలకు నౌకరులు. తమ్మ తాము పాలించుకొను హక్కు ప్రజలది. పజ్రల చిత్తమే చట్టము, ఏ ప్రభుత్వమునకు ఎప్పుడు ప్రజల కష్టము లేకపో యిసను ఆ ప్రభుత్వమును కూలదోసి తమయిచ్చవచ్చిన ప్రభుత్వమును ప్రజలు స్థాపించుకొనవచ్చును.” అనునది ఆయన రాజకీయ తత్వము. "ఏ ప్రభుత్వమునకును ప్రజ లయిష్టమునకు వ్యతి రేకముగ ప్రవర్తించుటకు హక్కు లేదు. ప్రజల స్వాతంత్యమును పొడుచేయుటకు అర్హత లేదు. స్వాతంత్ర్యము ప్రజల సహజధర్మము. ప్రజలస్వతంత్రతను కాపాడుకొనుటకును ప్రజలచిత్తమనకు లోబడి నడచుకొను టకును ప్రధమమున ఒడంబడికెలు జరిగి పజలు ప్రభుత్వము లనేక్సగుచుకొన్నారు. కాలక్రమమున గాజులును ప్రభువులును ఇతర ప్రభుత్వములును మొదటి యొడంబడి కెలకు భిన్నముగ ప్రజల స్వతంత్రతను హరించి ప్రజలను దాసులను చేసికొని నిరంకు శత్వమును స్థాపించియున్నారు. ప్రజలుత మహక్కులను గూర్చి మరచిపోయి బాధలకులోనయినారు. తిరిగి స్వతంత్రతమ