పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

అమెరికా సంయుక్త రాష్ట్రములు




క్రింద సండెను. అప్పటికి, సొన్ డొమింగో ద్వీపమును, న్యూ ఫౌండులాండుకు సమీపమున ఒకటి రెండు చిన్న ద్వీపములును, ఫ్రాన్సునకు లోబడియుండెను. -

{ఫ్రాంసు

(2) ఫ్రాన్సు దేశమునపుడు పదునారవ లూయి రాజు పాలిం చుచుండెను. ఈయనకు పూర్వము రాజు (ఫ్రాను పది హేనవ లూయి ఈయనపితామహూడు. పదు నేనవ లూయి స్త్రీలోలుడను వివిధ దుర్గణ సమన్వితండునునై యుండెను. ఆయన యుంపుడుకత్తెలు రాచకార్య. ములలో పెత్త సము :వహించి తమ యిష్టము వచ్చినట్లు మంత్రులను సేనానాయకులను నియమించుచు తీసి వేయుచు కొత్త వారిని నియమించుచు చెంచలబుద్దితో సంచరించినందున 1757 మొదలు జరిగిన 7 గంవత్సరముల యుద్దములో ఫొన్సు అమెరికాఖండములోను యూరపులోను హిందూ దేశములోను నోడిపోయి రాజ్యములో చాలభాగమును పోగొ ట్టుకొనెను. అదివరకు యూరఫుజాతులలో నెల్ల నగ్రస్థావము వహించియున్న ఫ్రాన్సు ఉత్తమస్థితిని కోల్పోయెను. హిం దూదేశపు సామాజ్యమును ఉత్తర అమెరికాలోని కనడావలన రాజ్యమును ఆంగ్లేయులకు వదలివేయవలసివచ్చెను. ఈయేడు సంవత్సరముల యుద్దమువలన ప్రపంచమురియొక్క రాజ్యమును వర్తకమును ఆంగ్లేయులకు సంక్రమించెను. మరియు పది హేనవ లూయీ రాజు మరణించు వరకు పరాసు ప్రభుత్వము యొక్కయుప్రజల యొక్కయ ఆర్థిక స్థితిమిగుల దుర్బలముగనుండెను. పదునారవ లూయి మిగుల యోగ్యుడు. కాని రెండు: