పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

ఆరవ అధ్యాయము

87



- వృద్ది చెందినది. కనడా దేశమునకు దక్షిణముననున్న దీసంయుక్త రాష్ట్రములు. అప్పటి కీ దేశములోని తూప్పు సముద్రతీరమునను కొద్దిగ మధ్యభాగమునకు మాత్రము ప్రదేశము నాక్ర మించి పదమూడు రాష్ట్రములు ప్రధానముగ నాంగ్లేయులచే నిండి ఆంగ్ల ప్రభుత్వమునకు లోబడియుండెను. అవియే ఇంగ్లాండు దేశముతో యుద్ధము చేయుటకు సంసిద్ధ ముగుచుండెను. వీకి జన సంఖ్య స్వతంత యుద్ధమునాటికి షుమారు ముప్పదియైదు లక్షలుండును. కనడాలోను సంయుక్త రాష్ట్రములలోను తెల్ల వారు నివసించిన ప్రదేశమునగాక మిగిలిన ప్రదేశములో ఎర్రయిడియను జాతుల వారు స్వతంతమైన ప్రభుత్వములను గలిగి నివసించుచుండిరి. ఈ యెర్ర యిండియునులను నాశనముచేసి పూర్తిరిగ నీ రెండు దేశములను తెల్లవారు ఆక్రమించుకొను కాలము ముందు రానున్నది. ఈపని కాలక్రమేణ జరిగెను. ఇంకోక డెబ్బది వత్సము కాలములో సంయుక్త రాష్ట్రము లలోని అమెరికనులు ఎర్రంగండియనులను నాశనముచేసిక్రమ క్రమముగ సంయుక్త రాష్ట్రముల దేశమునంతయు తూర్పున అట్లాంటికు మహాసముదము మొదలు పడమట పసిఫికు మహా సముదమువరకును స్వాధీనమును పొంది యింకను ముప్పది తొమ్మిది రాష్ట్రములను స్థాపించిరి. ఇవన్నియుగలసి నేడు “సుప్రసిద్దములగు అమెరికా సంయు క్త రాష్ట్రములుగ విలసిల్లు చున్నవి

సంయుక్త రాష్ట్రములకు దక్షిణముననున్న 'మెక్సికో దేశము స్పైన్ వారి క్రింద నుండెను. వీటికి తూర్పుననున్న 'పశ్చిమయిండియా ద్వీపములు వివిధ యూరోపియు జాతు