పుట:Aliya Rama Rayalu.pdf/81

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చేయుటకు సాహసించిన రామరాయల పరాక్రమమును వినుతించుట కుద్దేశింపబడినట్లు గన్పట్టుచున్నది కాని యీమైత్రానుబంధమునుగూర్చి ఫెరిస్తాయొకపలుకైన బలికియుండలే" దని వ్రాసి యున్నారు. [1] మఱియొకచోట "పైనుదాహరింపబడిన తెలుగుకావ్యములు రామరాయల పరాక్రమశక్తిని వానిగుణములను ప్రసిద్ధపఱచుటకుగాను నతడు తనప్రతిస్పర్థికి వినాశకుడైనట్లుగా దెలుపుచున్నారు; కాని యిదికవులెల్లరు ననుశ్రుతముగా నవలంబించెడి మార్గ" మని వ్రాసియున్నారు. [2]ఈపైయభిప్రాయములవలన రామరాయలయెడ వీరికెట్టి భావముగలదో యయ్యది విస్పష్టముగా దెలియుచున్నది. అనగా రామరాయలు తిమ్మయను బ్రతిఘటించి స్వశక్తిచే సేనలను సమకూర్చుకొని తిమ్మయపై దండయాత్ర సాగించి యాతనితో గాని యాతనికి సాహాయ్యముజేయ వచ్చిన విజాపుర సుల్తానుతో గాని తదితర సుల్తానులతో గాని యుద్ధముచేయకయే, తిమ్మయయనుచరవరమునకు లంచముల నొసగియు, సలకముతిమ్మయ తనకుదోడ్పడవచ్చిన విజాపురసుల్తానుకు నసంఖ్యాకముగా ద్రవ్యమునొసంగి వానిస్వస్థానమునకు బంపివేయునట్లుగా మోసబుజాబును వ్రాసియు, వారల సాహాయ్యము లభింపకుండజేయ రామరాయలుచేసినమోస

  1. The Aravidu Dynasty of Vizanagar. Page 9 foot note 5
  2. Ibid Page. 11 foot note 7.