పుట:Aliya Rama Rayalu.pdf/82

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మును దెలిసికొని యాద్రోహి తెంపరియై విద్యానగరమును వైభవశూన్యముగా జేసి తుదకు దారుణమైన యాత్మహత్య చేసికొని చావగా గృష్ణరాయనిరాణుల యాజ్ఞశిరసావహించి హతశేషులు ద్వారములు తెఱచి యామహానగరమును రామరాయలచేతబెట్టి రనివీరియభిప్రాయము. ఇదియెంతమాత్రము విశ్వాసపాత్రమయిన సత్యము గాదు. అచ్యుతదేవరాయనిభార్య వరదాంబికాదేవి సామ్రాజ్యము తనకొడుకునకు నిలుచునట్లుగా దనకు దోడ్పడినయెడల విశేషద్రవ్యము నొసింగెద నని యాహూయముచేయ, విజాపురసుల్తాను స్వసైన్యముతో బయలుదేఱివచ్చుచుండ, సలకముతిమ్మయ దెలిసికొని, తనరాయబారులమూలమున విశేషద్రవ్యమునొసంగి, యాతడుమరలితనరాజధానికి బోవునటుల చేసెనని మొదటవ్రాసిన 'కోఱియా' మఱియొకచోట సలకముతిమ్మయను బ్రతిఘటించి తొలగిపోయినయాతని ప్రతిపక్షమువారు (రామరాయలపక్షమువారు కాబోలు) విద్యానగరము స్వాధీనముజేసి యాతనిపరిపాలనమునకు లోపడివ్యవహరింతుముగాన దమకు దోడ్పడి సలకముతిమ్మయను రాజ్యభ్రష్ఠుని గావింప వలసినదని ప్రార్థింప, నాతడు సమ్మతించి రాదలంచియుండ, సలకముతిమ్మయ తెలిసికొని రాయబారులద్వారా యాఱులక్షలహొన్నులనుబంపించి, విద్యానగరమునకువచ్చి తనకుదోడ్పడినయెడల దారిబత్తెములక్రిందను దినమునకు మూడులక్షల హొన్నులచొప్పున నిచ్చుటయేగాక తనకుసామంతుడనై కప్ప