పుట:Aliya Rama Rayalu.pdf/79

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


హొన్నులద్రవ్యము నొసగ బడినట్టు దెలియుచున్న దనిగూడ లిఖింపబడి యుండెను. ఇంతద్రవ్యమును విచ్చలవిడిగా వెచ్చపెట్ట గలిగిన భాగ్యశాలియగు సలకముతిమ్మయమిత్రులగుమంత్రులకు నళీయరామరాయలులంచములనిచ్చి వశ్యులనుగావించుకొనుటచేత రామరాయలు స్వపరివారముతో విజయనగరద్వారమును సమీపించినంతనే యామంత్రులెల్లరు నగరద్వారములనుదెఱచివేసి రనిమహమ్మదుఖాశిం ఫెరిస్తా వ్రాసియున్నాడు. ఇంతియగాదు సలకముతిమ్మయకును రామరాయలకును యుద్ధము జరిగినట్లే చెప్పడు. సలకముతిమ్మయ యుద్ధములో మరణించి నట్లు ప్రశంసింపడు. ఆత్మహత్యచేసికొని సలకముతిమ్మయ చచ్చె నట! హీరానుఫాదిరిగారి విశ్వాసమునకు బాత్రములైన మహమ్మదుఖాసింఫెరిస్తావాక్యము లిట్లున్నవి. "తానువంచింపబడిన విషయమును దెలిసికొని యంత:పుర రాజమందిరమున దల్పులుబిగించుకొని నిరుత్సాహమూలమున పిచ్చిపట్టిపోయి రాజుగారియేనుగులు, గుఱ్ఱములు, మొదలగువానిగ్రుడ్లు పెరికించియు, తోకలుగోయించియు, తనశత్రువులకు నిరుపయోగములగునటులు గావించె నట. అనేకయుగములనుండి వంశ పరంపరగా సంపాదింపబడిన వజ్రములు, కెంపులు, పచ్చలు మొదలుగా నవరత్న రాసులను, అమూల్యములగు మౌక్తిక రాసులను బెద్దపెద్దతిరుగటి రాళ్లలో బోయించి విసిరించి పొడుము గావించి భూమిపై చల్లించెనట! అంతనతడు తన