పుట:Aliya Rama Rayalu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నుండి బయలు వెడలివచ్చి గుత్తిదుర్గమున బ్రవేశించి కొంతరక్షణసైన్యముతో సదాశివరాయని నచటనిలిపి, తనపెద్దతండ్రి యగునౌకుతిమ్మరాజు వానిపుత్రులుమొదలుగా బంధువర్గముతోడను, సొన్నలాపురముహండేహనుమప్పనాయడు, పెమ్మసానిపెదతిమ్మప్పనాయడు, మెసాపెద్దప్పనాయడు మొదలుగా సామంతవీరవర్గముతోడను గూడి యసంఖ్యాకసైన్యములతో తిరుమలరాయవేంకటాద్రులు తనకంగరక్షకులుగా నుండి సేవింపుచు వెంటరా రణభేరి మ్రోగించుచు మహారభసముతో సలకముతిమ్మరాజుపై దండయాత్ర సాగించి వెడలి విద్యానగరమును సమీపించుచుండెను.

ఈదండయాత్ర మొదలుపెట్టుటకు బూర్వమె "మీరు చేసినద్రోహమునకు మేమెంతయుదు:ఖపడుచున్న వారమైనను, దీనినంతనువిధివశమయినకార్యముగా భావించి మేము మీకు వినయవిధేయులమై మీయధికారపాలనమునకు లోపడి యనువర్తింప గలవారముకాని యీసామ్రాజ్యమున కపాయకరులును శత్రువులు నగుతురకప్రభువులనుమాత్రము మున్ముందుగా విజయనగరమునుండి పంపివేయవలసినదిగా బ్రార్థించుచున్నార" మనియొకజాబు వ్రాసి గుత్తిదుర్గమునుండి సలకము తిమ్మయక బంపించెననియు, అత డందుల కెంతయు సంతోషించి యాసమాచారమును విజాపురసుల్తానునకు దెలియజేసి తాముచేసికొన్న యొడంబడిక ప్రకార మేబదిలక్షల హొన్నుల నాతనికొసంగి యతని వానిరాజ్యమునకు బంపి