పుట:Aliya Rama Rayalu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రని కోరియాయనునాతడు వ్రాసి యున్నాడు. అప్పు డళియరామరాయలుగూడ తనసోదరు లిర్వురుతోను విద్యానగరమును విడిచి పోయెను. వీరికిద్వేషము ప్రభువయిన చిన్నవేంకటాద్రిపై యెంతమాత్రము లేదు. వానికార్యకర్త యైనసలకము చినతిమ్మరాజు పయినమాత్రమెగలదు. వారు సేనలను సమకూర్చుకొనివచ్చి యాదుర్మార్గుని శిక్షింప జూచుచుండిరి. ఇంతలో సలకముచిన్నతిమ్మరాజు చేయుదుష్పరిపాలనము బహుక్రూరముగా బరిణమించుచుండెను. రాజభండారములోనిధనము నంతయు గుట్రచారుల లంచముల క్రిందను, దుష్కార్య నిర్వహణము కొరకును దుర్వ్యయము సలుపు చుండెను.

సలకముతిమ్మరాజుద్రోహకృత్యములు

ఇతడు మాయోపాయముచే దనకు బ్రతిపక్షులుగా నున్న ప్రభువుల రప్పించి వారలను జంప బ్రయత్నించెను. వీనిమాయలో దగుల్కొని మొదటవచ్చిన కొందఱగ్రుడ్లు పెఱికించెను. ఈసమాచారమును విని వెనుకవచ్చినవారు మరలిపోయి పగదీర్చుకొన బ్రయత్నములు సలుపుచుండిరి. సామాన్యప్రజలు వాని నెదుర్కొన జాలరైరి. హిందూసామ్రాజ్యరాజధాని యగువిజయనగరమున సంభవింపనున్న విప్లవమునకు గోలకొండవిజాపురసుల్తాను లత్యంతసంతోషముతో నేరీతిగ బరిణమించునో యని వీక్షింపుచుండిరి. ఇట్టి