పుట:Aliya Rama Rayalu.pdf/71

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

లేకుండెను. అందుముఖ్యముగా గృష్ణదేవరాయలభార్య లగు తిరుమల్దేవికిని, చిన్నాదేవికిని సామ్రాజ్యభారము నలియరామరాయలును, వానిసోదరులును వహింపవలయు ననిపెద్దకోరిక గలదు. సామ్రాజ్యపరిపాలనా భారము నలియరామరాయలకును వానిసోదరులకును విడిచిపెట్టి కోశాధికారభారమునుమాత్రము వహింపవలసిన దని సలకముచినతిమ్మరాజునకు మాండలికప్రభువులు తెలియ జేసిరికాని యాత డందుల కంగీకరింప డయ్యెను. ఇతనిపరిపాలనము సామ్రాజ్యమునకు గొప్పముప్పు తేగల దనుగట్టినమ్మకము గలవా రగుటచేత రామరాయలును వానిసోదరులును విద్యానగరమును విడిచిపోవ నిష్టపడలేదు. అభిప్రాయభేదము లుదయించుటచేతను, సామ్రాజ్య మపహరింపవలె ననిదురాశతో గూడియున్నవా డగుటచేతను, విద్యానగరమున వారలయునికి తన సంకల్పమును విచ్ఛిన్నముచేయు నట్టిదిగ నుండుటచేతను, సలకము చిన్నతిమ్మరాజు దురాలోచనమునకు లోనయి యాసోదరులను చెరపట్టి యుంచవలె ననిప్రయత్నించెను. వీరినిమాత్రమెగాదు. తనప్రయత్నముల కడ్డముతగులువారని తనకు దోచినవారినెల్లరను బంధింప గుట్రలు చేయ మొదలుపెట్టెను. వీనిదుష్ప్రయత్నములను కుట్రలను దెలిసికొని యనేక మాండలికప్రభువులు విద్యానగరమును విడిచిపెట్టి స్వస్థానములకు బోయిరి. అట్లుపోయి కొందఱు విద్యానగరముతో సంబంధమునువీడి స్వతంత్రు లగుటకు బ్రయత్నింపు చుండి