పుట:Aliya Rama Rayalu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మలాంబికను వివాహమాడినవిషయ మొక్కటియే పేర్కొన బడియున్నది.

అలియరామరాయలు కృష్ణరాయలసైన్యములో నొక గొప్పసేనాధిపతిగ నుండి యొకతెలుగుమండలమునకు బాలకుడై పరిపాలించుచుండె నని 'కోయుటో' (Couts) అను చరిత్రకారుడు వ్రాసియున్నా డని హీరానుఫాదిరిగారి యారవీటివంశచరిత్రమునందు దెలుపబడినది. కృష్ణదేవరాయల వారు తనయవసానకాలమునకు బూర్వము రాజ్యపరిపాలనాభారము నలియరామరాయల చేతులయందును, సైన్యాధికారిభారము నంతను రామరాయలతమ్ముడగు తిరుమలదేవరాయల చేతులయందును బెట్టె ననియు, తాను మరణించునపుడు తనసామ్రాజ్యమున కచ్యుతదేవరాయలను బట్టాభిషిక్తునిగా జేయవలసిన దని 'అలియరామరాయల' కాజ్ఞాపించె ననియు, అతనియభిమతముననుసరించి రామరాయలు కృష్ణరాయనిమరణానంతరము నటుగావించె నని 'క్వెరోజు' అను చరిత్రకారుడు వ్రాసియుండె ననిపై యారవీటి వంశచరిత్రమునందు వక్కాణింపబడినది.


అచ్యుతదేవరాయలు - రామరాయలు


అచ్యుతదేవరాయలవారు క్రీ. శ. 1530 మొదలు క్రీ. శ. 1542 వఱకు బండ్రెండు సంవత్సరములమాత్రమే విజయనగరసామ్రాజ్యమును బరిపాలించెను. ఇతని పరిపాల