పుట:Aliya Rama Rayalu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆస్వామియె తిమ్మరాజు స్వప్నమున సాక్షాత్కరించి కడమకన్ను నీ వొసంగవలసినదనియాజ్ఞ నిచ్చె ననియు, అంతట నాతడు దయతో నతనికి జూపొసగె ననియు గని తెలిపియున్నాడు.

మండువేసవికాలమున నొకప్పుడు తిమ్మరాజు దండుతో బ్రయాణము సేయుచున్నప్పుడు సైనికులకు దప్పిచే నోళ్లెండుకొనిపోవుట నాతని కెఱిగింప నాతడు నిండుమనంబుతోడ విష్ణుమూర్తినిబ్రార్థించి 'దోని సిరంగరాజు కొండనెత్తమున' తక్షణమె యొకనీటిబుగ్గను బుట్టింపగా రెండుఘటికల కాలమందు నీరముండెననియు, దీనినెల్లవారు చూచి రనియు గవి:-

       "ధన్యుండు రామభూధవుతిమ్మనృపతి
        సైన్యసమేతుడై చెత్రమాసమున
        దండు వోవుచు నుండి తనభటుల్ త్రోవ
        నెండిననోళ్ల దప్పెఱిగించుటయును
        నిండుచిత్తమున దోని సిరంగరాజు
        కొండనెత్తమున వైకుంఠుని దలచి
        గోవిందు వేడి గ్రక్కున నొక్కబుగ్గ
        భూవినుతంబుగా బొడమంగ జేసె
        నందఱుజూడగానన్నీర మచట
        గ్రందుగా విలసిల్లె ఘటికాద్వయంబు."


అనుపంక్తులలో దెలుపుటయెగాక పద్యబాలభాగవతమునగూడ, "కరుణమీగాములగట్టుపై వేసవి బుట్టించె