పుట:Aliya Rama Rayalu.pdf/53

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

జలము లేభూసుతుండు" అని చెప్పి యున్నాడు. ఈతిమ్మరాజు మాహాత్మ్యమెట్టి దైనను ఇతడసమానయోధాగ్రేసరు డనియొప్పుకొనక దప్పదు. దోనిసిరంగరాకు కొండనెత్తమునకే మీగాములగట్టని నామాంతరము గలదని తెలిసికొనవలయును. రెండునామములనుబేర్కొన్న కవియొక్కడే యగుటవలన నట్లూహింప నగును. అయ్యవి వేఱ్వేఱుప్రదేశము లయి యున్నయెడల నొక్కకవియె యట్లుచెప్పుట సంభవింపదు. అట్లు చెప్పినది సత్యమేయగునేని యసలు విషయముయొక్కసత్యను గూర్చి శంకింప వలసివచ్చును.

ఈతిమ్మరాజునకు

      " గండరగూళికి గండర,
        గండని కుద్దండరాయగణవారణస్త్రీ
        గండాంకున కెంతెంబర
        గండనికిన్ బట్టవాడ గజసింహునకున్."

అని వక్కాణింపబడిన బిరుదములలో 'గండరగూళి' యనుబిరుద మతనిపూర్వు డగుకొటికంటి రాఘవరాజు సంపాదించినదిగాని యితడు సంపాదించినది కాదు.

మఱియు,


        'చాళుక్యచక్రవర్తికి
         మాళవమదభంజనునకున్ మర్దితశకనే
         పాళునకు బిరుదుమన్నెవి
         భాళునకున్ మన్నెపులికి భాసురమణికిన్.