పుట:Aliya Rama Rayalu.pdf/30

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నీపేరు పెట్టుకొందును; నన్ను రక్షించివిడువు మనిపాదములను బట్టుకొని వేడుకొన్నందున శరణాగతరక్షణము వీరపురుషధర్మము గావున దాని బాటించి వానివిడిచిపుచ్చి తనసర్ధారులు కోరగా నాఱువేల యశ్వములను వానిచేత వారల కిప్పించుటయు దటస్థించి నపుడు కలిగిన నవమానముకంటె నెక్కువ యవమానమేముండును? దీనిని గప్పిపుచ్చగోరి మహమ్మదీయచరిత్రకారులు పైవిధముగా గథ మార్చి వ్రాయుట సంభవించినదిగా దోచుచున్నది. ఈపరిభవమును చక్రవర్తి భరియింప జాలక పిచ్చిపట్టిపోయి తనరాజధాని డిల్లీనగరమునుండి దేవగిరికి మార్చవలె నని ప్రతత్నించెను. డిల్లీ పురవాసులను బెక్కండ్రు ధనికులను డిల్లీ విడిచి రావలసిన దని నిర్భంధపఱచెను. అనేక వేలసంఖ్యలవారిని డిల్లీనుండి బయలుదేఱ దీయ గలిగెనుగాని వారెవ్వరును ప్రాణములతో దేవగిరి చేరియుండలేదని ఇబూబచూతా' యనుచరిత్రకారుడు వ్రాసి యుండెను. ఇతడు చక్రవర్తికి సమకాలికుడు గావున గొంత నిజముచెప్పి యుండు నని విశ్వసింపవచ్చును. ఆనెగొందిపై సాగించినదండయాత్రలో గూడ ప్రఖ్యాతములయిన మాళవసైన్యము లుండి వానిపక్షమున హిందూరాజులతో బోరాడియుండిరి గావున దత్సైన్యముల కధికారిగనున్న సేనాని తురకసర్దారుని జయించియుండుటచేతనే సోమదేవరాజును 'మాళవరాజేంద్రమస్తకశూల' యనుబిరుదముగలవానిగా బాలబాగవతగ్రంథకర్త వక్కాణించుట సంభవించెను.