పుట:Aliya Rama Rayalu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇతడు వహించిన 'ఆకులపాటివీరక్షేత్రభారతీమల్ల; ముదిగంటి భారతీక్షేత్రమల్ల; ఆనెగొంది వీరక్షేత్ర భారతీమల్ల; కుంతివీరక్షేత్రభారతీమల్ల; ఆకులపాటిముదుగంట్యానెగొంది కుంతిసరవిజయలక్ష్మీ సమక్షీకరణలక్షిత; వీరక్షేత్రభారతీమల్లబిరుదభరితానుభావ;' అనుబిరుదమును సోమదేవునకును డిల్లీచక్రవర్తి యగుమహమ్మదుబీన్‌తుఘ్‌లఖునను జరిగిన యుద్ధములందు బై చెప్పినయానెగొంది సమీపదేశమంతయును వీరక్షేత్రముగా (యుద్ధరంగము) నుండె నని దెలుపుచున్నది. మఱియు నితడు సర్వతంత్రస్వతంత్రుడై విజృంభించె నని చాటుచున్నది. ఇంతియగాదు, 'హొసబిరుదురగండ' రాయరణరంగభీభత్స రాయరాహుత్తరగండ' బిరుదములను వహించుట కర్ణాటసామ్రాజ్యాధీశ్వరునకు సామంతుడు గాడనియు స్వతంత్రుడనియు, వారలకు బ్రతిస్పర్థిగాను శత్రువుగాను, నుండె నని దెలుపుచున్నవి. అట్లు ప్రతిస్పర్థవహించి పోరాడినవారు వీనికి సమకాలికు లయినకంపిలిరాయడును, వానిమంత్రులును వాని తరువాత రాజ్యపరిపాలనమునందు డిల్లీచక్రవర్తిచేత నెలకొల్పబడినవారును నగుహరిహరరాయలును, బుక్కరాయలు నై యున్నారు. పయిబిరుదము లన్నియును సోమదేవరాజు హరిహరరాయ లనువానితమ్ముని బుక్కరాయలను తుంగభద్రానది కుత్తరభాగమునుండి దక్షిణభాగమునకు దఱిమినచరిత్రభాగమును దెల్పుబిరుదములుగాని యన్యములు గావు. హొసబిరుదుగలవారు హొసపట్టణవాసు లగువీరులకుగాని తత్పాలకులకు