పుట:Aliya Rama Rayalu.pdf/218

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

లును గలరనిహీరాసుఫాదిరి వ్రాసినది సత్యమని విశ్వసింపరాదు. లక్షలకొలదిపదాతిసైన్యము గలదు. హిందూసైన్యము డెబ్బదివేల యాశ్వికులతోడను, తొంబదివేల పదాతులతోడను గూడుకొని యుండెనని ఫెరిస్తావ్రాయుచు మఱియొకతావున నింతకన్ననధికముగా నున్నట్టువ్రాసియున్నాడు. ఒకఅనామధేయ చరిత్రకారుడు లక్షయాశ్వికులును, మూడులక్షల పదాతులును గలరని వ్రాయుచుండగా గొందఱు పోర్చుగీసు గ్రంథకర్తలు గుఱ్ఱపుదళముసంఖ్య నొప్పుకొనుచు పదాతిసైన్యము లాఱులక్షలుండెనని వాక్రుచ్చుచున్నారు.[1] ఈసైన్యమునంతయు మూడువిభాగములను జేసి రామరాయలు, తిరుమలరాయలు, వేంకటాద్రి మూవురును మూడుభాగముల కాధిపత్యము వహించిరి. రామరాయలు యుద్ధమునాటికి మిక్కిలివృద్ధుడుగా నున్నట్లు చరిత్రములన్నియు నైకకంఠ్యముగా దెలుపుచున్నవి. రామరాయలు డెబ్బదేండ్ల వయస్సు వాడని ఫెరిస్తాగ్రంథమును ఎనుబదేండ్లవయస్సువాడని 'బురహాన్ - ఈ - మాసీర్‌' అనుగ్రంథమును దెలుపుచుండగా బోర్చుగీసు చరిత్రకారులు రామరాయలు తొంబదియాఱు సంవత్సరముల వయస్సుగలవాడని కంఠోక్తిగా దెలుపుచున్నారు. వీరుచెప్పినదానిలో సంఖ్యయెట్టిదైనను రామరాయా

  1. The Aravidu Dynasty of Vijianagar p. 200, 201.