పుట:Aliya Rama Rayalu.pdf/219

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

దులు వృద్ధులనుట సత్యమని మనము విశ్వసింపవచ్చును. వారుత్తమరాజవంశములలో బుట్టినవారు గనుక వయోవృద్ధులయినను, దేహదార్డ్యము, మనోధైర్యము, పౌరుషముగలిగి పరాక్రమశక్తిసంపన్నులరై యుందురనుట కెంతమాత్రమును సంశయింప బనిలేదు. ఈయుద్ధమునుగూర్చి చండావర్కరుగారు మరాఠీభాషలో బ్రకటించిన 'విజయనగర వినాశన' మను గ్రంథమునుండి యెత్తి హీరాసుఫాదిరి తనగ్రంథమునందు బ్రకటించిన విషయములు గొన్ని కేవలము నసత్యములని స్పష్టముగా జెప్పవచ్చును.

"ఈయుద్ధమునకై రామరాయలు విజయనగరము నుండి బయలుదేరుటకు ముందు స్వకీయాంత:పురమునకుజని తనపట్టమహిషియగు సత్యభామాభాయికి విలువగల యాభరణములను బహుమానము చేసెనట ! పిమ్మట దేవచింతామణిత్రివేగల యనుభార్యకడకు బోయి యామెతో సంతోషమున గొంతకాలము గడపి కొన్నిబహుమానములను గావించె నట ! అటుపిమ్మట 'మానమోహిని నిజస్వరాపి' యను మూడవభార్య మందిరమునకు బోయెనట ! అనేక విధములుగా నామె రాయలను సంతోషపఱచుటకై ప్రయత్నించెనట ! అతడు తనయారామములనుండి యిరువదివిధములయిన ఫలములను దెప్పించి భార్యలకు బంచిపెట్టించె నట! తరువాత నతడు తనతల్లియగు చంద్రశాల గదికిబోయి యామెను సందర్శించె నట ! అతనికి చెడుగు కలుగ