పుట:Aliya Rama Rayalu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిచ్చి పంపగా నతడు 'బహఉద్దీన్‌' సైన్యములను దలపడి యుద్ధమున జయించి వానిం బట్టుకొన బ్రయత్నించెను గాని వాడు తప్పించుకొని పాఱివచ్చి ఆనెగొందెపురాధీశ్వరు డైన జంబుకేశ్వరరాయలను శరణువేడగా నత డభయదాన మొసంగెను. జంబుకేశ్వరుడు 'బహఉద్దీ' నునకు రక్షణ యొసంగె నను సమాచారమును చక్రవర్తివిని కోపోద్దీపితుడై ప్రఖ్యాతిగాంచిన చెందేరి, బుదావూను, మాళవసైన్యముల నసంఖ్యాకముగా జేర్చుకొని దండెత్తివచ్చి యానెగొందికి సమీపమున నున్నకంపిలిదుర్గమును ముట్టడించి హిందూసైన్యము నోడించి యాదుర్గమును తొలుత స్వాధీనపఱచుకొని 'మల్లికునాయబు' అనువానిని దనకుబ్రతినిధి పాలకునిగా నియమించి కొంతసైన్యముతో వానినచట నిలిపి యానెగొంది ముట్టడింప బోయెను. ఈభయంకరమైనవార్త విని జంబుకేశ్వరరాయలు తనసేనల నన్నిటిని సమకూర్చుకొని తాను ముందుగా నెదురువచ్చి మారుకొని ఘోరసంగ్రామము గావించెనుగాని తనకు జయముకలుగు నన్నధైర్యము లేకపోవుటచేతను, శరణాగతుడైన బహఉద్దీనుని వానికి వశ్యపరచి తానావిపత్తునుండి తప్పించుకొనుట ద్రోహమని తలపోయుట చేతను, తెంపరితనము వహించి తనస్త్రీల నెల్లర నగ్నిప్రవేశ మగునటులు గావించి శత్రువుల మార్కొని ప్రాణములున్నంతవఱకు బోరాడి తుదకు వీరస్వర్గమును గావించెను. మహమ్మదు బీన్‌ తుఘ్‌లఖ్ ఆనెగొందిని బట్టుకొనియెను. ఇతనికి దాయాదు లయిన కొటిగంటి రాఘవరాజును,