పుట:Aliya Rama Rayalu.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కదనరంగమున వానిసంహరించి, రాజ్తముతా నాక్రమించుకొని, తురకల యొత్తిడివలన దేవగిరిని విడిచివచ్చి, కంపిలి రాజధానిగ జేసికొని, కొంతకాలము పరిపాలనచేసి మరణించెననియు, అటుపిమ్మట వానిమంత్రియగు బైచప్ప యను నాతడు వానికుమారు డయిన కంపిలిరాయనికి బట్టము గట్టెననియు, నాగ్రంథమున వర్ణింప బడియుండెను. మఱియు నాగ్రంథమున కంపిలిపురమున బ్రతిష్ఠాపింప బడియున్న సోమేశ్వరదేవుని వరప్రసాదమున జనించిన వా డగుటచేత దమకుమారుని గంపిలిరాయ డనిపేరు పెట్టిరనికూడ వక్కాణించి యున్నవాడు. కనుక బాలభాగవతమున బేర్కొనబడిన కంపిలిరాయ డను నామమొక వ్యక్తినామమే యైనయెడల కొటిగంటి రాఘవరాజు వీనిసైన్యములనేజయించి 'గండరగూళి' యనుబిరుదము గైకొన్నవాడని చెప్పవలసి యుండును. కంపిలిరాయ డనునది వ్యక్తినామముగాక కంపిలిప్రభు వనియర్ధము చేసికొన్నపక్షమున మఱియొకవిధముగా జెప్పవలసియుండును.

ఈవంశములోని రెండవశాఖకు సంబంధించిన విజయధ్వజునివంశము లోనివాడగు జంబుకేశ్వరరాయ లానెగొంది పురమున కధీశ్వరుడై యున్నకాలమున డిల్లీచక్రవర్తి పక్షమున బ్రతినిధిపాలకుడుగా ఘూర్జరదేశమును బాలించుచున్న 'బహఉద్దీ' ననువాడు చక్రవర్తిని నలక్ష్యము చేసి స్వతంత్రపరిపాలనముచేయ నారంభించినపుడు వానిజయించి పట్టుకొని వచ్చుటకై చక్రవర్తి 'ఖాజాజెహాన్‌' అనువానికి గొంతసైన్యము