పుట:Aliya Rama Rayalu.pdf/19

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గూళి' యనుబిరుదమును వహించినవాడని కవిచెప్పిన దానినిబట్టి కొంతచరిత్రమును దెలిసికొనుట సాధ్యముకాగలదు.

నరపతివిజయమునందు వక్కాణింప బడిన తాతపిన్నమరాజు బిరుదగద్యములో 'సమస్తదురాచార చెఱుకురాచనాయక రాజ్యసప్తాఙ్గహరణ' అని చెఱుకు రాచనాయకుని ప్రశంసగన్పట్టుచున్నది గాని కంపిలిరాయనిగెల్చి 'గండరగూళి' యనుబిరుదము గైకొన్నవిషయము ప్రశంశింపబడియుండలేదు. అయిన నియ్యవి నిజమగు చరిత్రమును సూచించునవిగా నున్నవనుట కనుమానింప బనిలేదు.

ఇందు బేర్కొనబడినకంపిలిరాయ డెవ్వడో మనము ముందుగ దెలిసి కొనవలసియున్నది. కంపిలి కృష్ణానది కుపశాఖ యగు తుంగభద్రానది యొక్క దక్షిణపుటొడ్డున యానెగొందికి నెదురుగ నున్నది. శివకవులలో గంగాధరు డనునొక కవి 'కుమారరామనచరితె' యను కన్నడభాషా కావ్యము నొక దాని రచించి యందు కంపిలి రాజులచరిత్ర మభి వర్ణించియున్నాడు. ఈకావ్యమున కుమారరామనతండ్రి కంపిలిరాయ డనివక్కాణింపబడి యుండెను. కంపిలిరాయని తండ్రి ముమ్మడి సింగనయనియు, ఇతడు దేవగిరి రాజధానిగా మహారాష్ట్రదేశమును బరిపాలించిన సేవణవంశీయు డగు రామదేవరాయని కొల్వున నొకదుర్గాధిపతిగ నుండి, యాతని మరణానంతరమున నతనిమేనల్లు డగు మల్లదేవుడు రాజ్యమాక్రమించుకొన నందున కియ్యకొనక, ముమ్మడిసింగన వాని నెదుర్కొని