పుట:Aliya Rama Rayalu.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిపాలనమున విఠలేశ్వరుని దేవాలయమున బ్రతిష్ఠాపింపబడిన యొకశిలాశాసనము యొక్క ప్రతినితెప్పించి యందు 1519 సంవత్సరములో కృష్ణదేవమహారాయలవారు కొన్ని గ్రామములలో కైంకర్యములకుగాను గొన్నిసుంకములవసూలుచేయుట కనుజ్ఞ నిచ్చియుండుటనుగాంచి యవి చాలకకైంకర్యములు వెనుకబడి నిలిచిపోయినందున భైరవదేవుని కైంకర్యములకుగాను సుంకములకై సదాశివరాయలవారు దానశాసనము వ్రాయించెనని 1557 సంవత్సరములోని యొకశాసనము దెలుపుచున్నది. [1]

ఇట్టిదానశాసనము వ్రాయించినచక్రవర్తి ఖైదులో నుండి యీశాసనమును వ్రాయించె ననిమనము విశ్వసింపవలయునా ? ఎంతవిపరీతవిషయము ? ఇట్టి శాసనములు పెక్కులు గలవని 'హీరాసుఫాదిరి' యొప్పుకొనుచునే యున్నవాడుగావున గ్రంథవిస్తరభీతిచే వాని నిచటనుదాహరింప విరమించుచున్నాను. ఇతడు 1550 లో సదాశివరాయలు ఖైదులోనుంచబడి నట్లును, ఇతనిఖైదుచేసి నందులకై రామరాయలసోదరు లయినతిరుమలరాయలును వేంకటాద్రియు రామరాయల యధికారమును ధిక్కరించి 1551 సంవత్సరమున దిరుగుబాటుచేసి యుద్ధముచేసి రట ! ఈసత్య విషయమును గోల్కొండదర్భారులో నుండునొకయనామధేయ చరిత్రకారుడు వ్రాసినా డట ! కీర్తిశేషు లయినకృష్ణశాస్త్రిగారు సత్యవిరుద్ధ

  1. Ep. Carn, XI, Mk. 1