పుట:Aliya Rama Rayalu.pdf/173

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గలుగునటులుచేయ బ్రయత్నించుట మిక్కిలిశోచనీయముగా నున్నది. తాము స్వయముగా నెఱిగియుండి వ్రాసినవిగాక యెవ్వియో లోకప్రవాదముల నార్వీటివంశప్రభువుల నసూయతో జూచువారినుండిగాని సామ్రాజ్యవైరులుగ నుండిన విమతస్థులగు హైందవేతరజాతివారలనుండిగాని విని పరస్పరవిరుద్ధము లగువ్రాతలువ్రాసిన విదేశస్థులవ్రాతలను నమ్ము విదేశస్థుడైనయీచరిత్ర కారునకు సదాశివదేవరాయని కాలమున వ్రాయబడిన శిలాతామ్రశాసనములలోని వాక్యములసత్యత్వమెట్లు బోధపడ గలదు ? అందుచేతనే హీరాసుఫాదిరి యిట్లు వ్రాయసాహసించెను. [1]

"తనపరిపాలనకాలములో రెండవభాగమున, అనగా దానుఖైదులోనున్నప్పుడుసయితము కేవలము తనమంత్రిచేతనేగాక సదాశివరాయలతాను స్వయముగనే యాదేవాలయాదులలో వ్రాయించిన దానశాసనము లనేకములుగల వనుటకు యెంతమాత్రము సందేహములేదు........ ఈమతధర్మములకై లిఖింపబడిన శాసనములలో నధికసంఖ్యాకములు సదాశివరాయలపక్షమున జేయబడిన వైనను బహుశ: రామరాయల యుత్తరువునే పురస్కరించుకొని చేయబడి యుండును."

సదాశివదేవరాయలవారు వజ్రసింహాసనా రూడులై భూమిని పరిపాలించుచుండగా నళియరామరాయలవారి ధర్మ

  1. The Aravidu Dynasty of vijianagar page 41.