పుట:Aliya Rama Rayalu.pdf/153

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


విజయనగర హిందూపాషండు నిదివఱ కెన్నడును జేయని ఘోరకృత్యముల నీరెండు దండయాత్రల యందును గావించి రనిఫెరిస్తా వ్రాసి యున్నాడు.

మహమ్మదీయ దండయాత్రలలో మహమ్మదీయులు హిందువులపట్ల చూపినదుష్టమార్గములనే విజయనగర హిందువులును ఈదండయాత్రలలో మహమ్మదీయులపట్ల జూపియుందు రనిమనము విశ్వసింపవచ్చును. ఇట్టిపద్ధతులు మహమ్మదీయు లవలంబించినను హిందువు లవలంబించినను నర్హనీయములే యనుసత్యమును ఫెరిస్తా గ్రహించి యుండినయెడల తానువ్రాసినచరిత్రమున కెంతోమెఱుగు గల్పించినవా డయి సర్వజనశ్లాఘాపాత్రుడై యుండును. హింసహింసను వృద్ధి గావించును. ద్వేషముద్వేషమునే పెంచునుగాని సఖ్యత నొనగూర్ప జాలదు.

అబ్దుల్లాతో యుద్ధము

ఈకాలముననే విజాపురసుల్తానుకు పక్కలోబల్లెముగా నుండి భయమునుపుట్టించెడు జ్ఞాతిసంబంధమయిన వివాదము మఱియొకటి విజయనగరమువారితోడ్పాటువలన దుదముట్టినది. ఇబ్రహీమ్‌ఆదిల్‌షా బ్రదికియున్న కాలముననే వానియన్న కుమారుడు 'అబ్దుల్లా'యను నాతడు తనసోదరుడు పెట్టుబాధలనుండి తప్పించుకొని గోవానగరమునకు బోయినవెనుక వానిమిత్రులచే విజాపురసుల్తానుగా బ్రకటించుకొనవలసినదని