పుట:Aliya Rama Rayalu.pdf/113

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వస్తుసామగ్రియు, రాచకుటుంబములు వారివారిడేరాలతో గూడ నసాదుఖాను పాలయ్యెను. అంతదెల్లవాఱిన పిమ్మట వేంకటాద్రి చెదరిపోయిన సైన్యముల మరలసమ్మేళనము గావించి అసాదుఖానును వానిసైన్యములను ముట్టడింపవలయునని ప్రయత్నింపగా నతడునవాబరీదులను జేరుకొనియెను. అసాదుఖానుచేసిన ద్రోహమునకు గుపితుడై వేంకటాద్రి వానిమున్ముందు నడ్డగించి వానిని శిక్షించి తమకుటుంబముల కేవిధమైన నపకారముజరుగకమున్న వారిని చెఱనుండి విడిపింపవలయునను నాతురముతో నారవీటిరాచవీరకుమారవర్గము దోడ్పడ బదివేలగుఱ్ఱపురౌతులతో శత్రుసైన్యములను వెన్నంటివచ్చి కూరకచర్లకడ దలపడియుద్ధము చేసెను. కూరకచర్లయెచట నుండెనో దెలియరాదుగాని బాలభాగవతమునందు కూరకచర్లకడ నవాబరీదులతో యుద్ధము జరిగియున్నటుల చెప్పబడి యుండుటచేత నుభయసైన్యములు మరల గలిసికొని పోరాడిన ప్రదేశము కూరకచర్లయై యుండునని నేనుతలంచుచున్నాను. వేంకటాద్రి పెదతండ్రికుమారుడు అప్పలరాజిచట నవాబరీదులతో జరిగినఘోరాహవమున వారినిజయించియు మృతినొందినటుల బాలభాగవతమున జెప్ప బడియెను.[1] ఈయుద్ధము

 1.         "అమితవైభవుడయినయప్పలరాజు
           రమణీయమైనకూరక చర్లయొద్ద
           కడుమించుసాజరంగంబునగడిమి
           దొడరినట్టిసవాబరీదులనిర్జయించి
           తరణిమండలవిభేధనపూర్వకముగ
           సురలోకమునకురాజులుమెచ్చనరిగె." బా. భా. (ద్విపద)