పుట:Aliya Rama Rayalu.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నప్పలరా జొక్కడేజరిపినదికాదు. ఇతడును, ఇతనితండ్రియు గూడవేంకటాద్రిని వెంబడించివచ్చిన వారగుటచేతను వారుగూడ నీయుద్ధమును జరిపిజయముగొన్నవా రగుటచేతను అప్పలరాజు జయముగొనియు యుద్ధములో మరణము జెందెనని బాలభాగవతగ్రంథకర్త చెప్పియున్నాడు. ఇక్కడగూడ వేంకటాద్రికి సంపూర్ణవిజయము లభించిన దనిచెప్పక తప్పదు.

వేంకటాద్రితోబుట్టువు లక్కమాంబపుత్త్రుడును, తొరగంటిదుర్గాధ్యక్షుడు నగుపోచిరాజునరసింహరాజు కూడవేంకటాద్రికిని నవాబరీదులకును జరిగిన యీయుద్ధమున దోడ్పడియున్నట్టు నరస భూపాలీయములోని యీక్రింది పద్యమువలన విదితముకాగలదు.

        "క. గర్వితబరీదసేనా
            సర్వస్వహరానివార్యశౌర్యునకుసమి
            ద్ధూర్వహసపాదభయదా
            ఖర్వమహావిజయభేరికాభాంకృతికిన్."

ఈయుద్ధమునందు వేంకటాద్రి పరిపూర్ణవిజయమును బొందెను. గర్వితుడగుబీదరుసుల్తాను అమీర్ బరీదుషా యోడింపబడి బిరుదుమేళంబుతో గూడబట్టుపడినట్లుగా నరసభూపాలీయము, వసుచరిత్ర, నరపతివిజయములవలన దెలియుచున్నది.

        "గీ. అనుచుయవనుల దెగడితన్నాశ్రయించు
            వారిసామ్రాజ్యలక్ష్మినెవ్వాడుగొనియె