పుట:Adhunikarajyanga025633mbp.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంబంధము లేని యిప్పటి శాసనసభలవలన లాభమేమియు కన్పించుట లేదు. ప్రజాసామాన్యము ఏనియమముల ననుసరించి అనుదినము కూలినాలి చేసుకొనుచున్నారో, ఎట్టిజీవనభృతి సంపాదించుకొనుచున్నారో, ఆయావృత్తులం దెట్టి కష్టములు వారికి కల్గుచున్నవో విచారించుట కిప్పటి శాసనసభలు శ్రద్ధవహింపకుండుటయు, శ్రద్ధచేయవలెనన్నను వ్యవధిబొందకుండుటయు చాలా అసంతృప్తికరముగనే యున్నది. ఇంగ్లాండునందు లంకషైరు కర్మాగారాధిపతులు వారికార్మికులమధ్య క్రొత్తమెషినుల నుపయోగించవచ్చునా లేదా యను విషయముపై గొప్పతగాదా వచ్చి కార్మికులెల్లరు నిరుద్యోగులై బాధలు పడచుండ, పార్లమెంటు తనకు పట్టనట్లే యుండుట ప్రజల కయిష్టము కల్గించును. రాక్షసబొగ్గుగనులందలి కార్మికులు లక్షల కొలదిగా, యజమానులు పెట్టుతిప్పలు పడజాలక, సమ్మెకట్టి, నిరుద్యోగులైయుండ, పార్లమెంటు కండ్లుతెరచి చూచుచు, ఏమియుచేయకుండెను. ఇటులనే యితరదేశములందును, కర్మాగారాధిపతులు, భూస్వాములు, గనులయజమానులు, తమకార్మికుల హింసించుచుండ, శాసనసభ లేమాత్రము ప్రజలకు సహాయముచేయకున్నవి. ఇట్టిపరిస్థితులందు, కార్మికులకీసభలన్న గౌరవముకల్గుటెట్లు? ఇంతటితోబోక, కార్మికులు జయప్రదులై, తమసమ్మెలను, తీవ్రతరముగా సాగిం