పుట:Adhunikarajyanga025633mbp.pdf/326

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చుచు, హెచ్చు జీతభత్యముల కోరుచుండ, నిష్పక్షపాతముగ, మధ్యవర్తిగనైన యూరకుండక, శాసనసభలు, వానిపై యాధారపడియుండు మంత్రివర్గములు, కర్మాగారాధిపతులతరపున జేరి, కార్మికులహింసించుచు, వారిసమ్మెల నిర్మూలింప జేయుచున్నవి. ఇంగ్లాండునందు 1926 సంవత్సరమందు సాగించబడిన, "జనరలుస్ట్రైకు"ను నిర్మూలింప జేయుటకు ప్రభుత్వము, పార్లమెంటు తమశక్తులనన్నిటి ధారపోసిరి. మనదేశమందును, దక్షిణయిండియా రైలుమార్గముపై నట్టిసమ్మెయే జరుగుచుండ, ప్రభుత్వము, రైలుయజమానుల తరపున నిలబడి, కార్మికనాయకుల నిర్బంధించి, సమ్మెనుఓడించిరి. జమీందారీరైతులు వెంకటగిరియందు జమీందారుపై ఆందోళనజేయుచుండ, ప్రభుత్వము జమీందారులకు అండగా నిలబడుచున్నది. ఇట్టి దురన్యాయముల కల్గించుచుండు శాసనసభలు, వానిపై యాధారపడియుండు మంత్రివర్గములపై, కార్మికులకు సంపూర్ణముగా నమ్మకముపోయినది. కనుకనే, జర్మనీ, ఫ్రాన్సు, ఇంగ్లాండునందలి, కార్మికులలో తీవ్రవాదులందరు, రాచకీయజ్ఞులలో కొందరు, ఈకాలపు శాసనసభలు, ప్రజాభిప్రాయమును వెల్లడించలేవనియు, ప్రజాస్వామిక రాజ్యమనునది, ఈశాసనసభలద్వారా సాధ్యముకాదనియు, ఇప్పటి ప్రజాస్వామిక రాజ్యము వట్టి బూటకమనియు, అభిప్రాయ పడుచున్నారు. కమ్యునిస్టులు, సోషలిస్టులకు,