పుట:Adhunikarajyanga025633mbp.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముగా చాలాస్వతంత్రించి వ్యవహరించగలరు. బృందముల కట్టడియే తక్కువ. ఇక, బృందసమ్మేళనముల అదుపుఆజ్ఞలు కఠినము కాజాలవన్న ఆశ్చర్యమేమి? ప్రతిసభ్యుడును, ఒక బృందమునుండి మరొకబృందమునకు మరలుట దుస్సాధ్యము కాదు. బృందసమ్మేళనములు త్వరత్వరగా మారుచుండుట ఆశ్చర్యముకాదు. సభ్యులు బృందములపై నాధారపడి యున్నను, వ్యక్తిగతస్వాతంత్ర్యమును హెచ్చుగా బొందగల్గుచున్నారు. ఈపరిస్థితులు, ఫ్రాన్సునం దెచ్చుగా ప్రజ్వలించి యున్నను, కొంతవరకు జర్మనీయందును గాననగును. కమ్యునిస్టులు, సోషలిస్టులు, నాజీపార్టీవారలు జర్మనీయొక్క "రైష్ టాగ్"నందు కొంత సంఘైక్యత, కలయిక కల్గించుచున్నారు.

ఫ్రాన్సునందలి స్థాయిసంఘములకు, మంత్రివర్గములకుమించి, వ్యవహరించుటకు శక్తికలదు గనుక, వానిసభ్యులు అనేక స్వాతంత్ర్యాధికారముల బొంది, మంత్రుల వేధించి, వారిద్వారా అనేకలాభములను, ప్రత్యేకముగా తమకు, తమనియోజక వర్గములకు కల్గించుకొన జూచుచున్నారు.

ఇటుల పార్టీ బలముతగ్గి, సభ్యులవ్యక్తిగత ప్రాపకము హెచ్చుకొలది, సభ్యులు, దేశలాభముకై పోరాడుట కట్టిబెట్టి, సంకుచితాభిప్రాయులై, స్థానికలాభములగోరి, జాతీయసమస్యల నంతశ్రద్ధగా విచారించకుందురు. మరియు, వివిధబృంద సమ్మేళనముల జేరుటవలననే, వివిధలాభములు, అనుభవము