పుట:Adhunikarajyanga025633mbp.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లుకల్గునను ఆతురతచే, మంత్రాంగ సభల అచిర కాలజీవులజేసి, ప్రభుత్వమును నిర్బలత జేయుచుండుటయు జూడనగును.

రాజ్యాంగమందుండు రాచకీయపక్షము లన్నియు, రాజ్యాంగవిధానమునే యుపయోగించి, సక్రమమగు మార్గములద్వారా, తమరాచకీయప్రచారమును జేయగోరువరకు, శాసనసభలందు కార్యక్రమము సంతృప్తిగా జరుగును. జర్మనీ, ఫ్రాన్సునందువలె కమ్యునిస్టులు, సోషలిస్టులు, తమచే నిర్ణీతమగు నియమములు సంతృప్తినొందినగాని, మంత్రివర్గములందు జేరమనుపట్టుదల జూపుట రాజ్యాంగ క్షేమమునకు భంగకరము. జర్మనీయందు ముఖ్యముగా, కమ్యునిస్టులు, నాజీలు, ఇప్పటి ప్రజాస్వామిక బాధ్యతాయుత రాజ్యాంగ విధానమందు నమ్మికకల్గియుండక, నిరంకుశ రాజ్యాంగము గోరుచు, ప్రజాప్రతినిధిసభయందు, తదితర రాచకీయపార్టీలతో సంపూర్తిగా సహకార మొనర్పనంతవరకు, రాజ్యాంగాభివృద్ధి కాజాలదు.

శాసనసభాసభ్యుడు, ప్రజాసేవనార్థమై, తనధర్మనిర్వహణార్థమై, రాచకీయబృందమునందు చేరవలసియుండుటే కాక, ప్రజాప్రతినిధిసభయందలి ముఖ్యములగు రాచకీయ బృందసమ్మేళనములు రెండు లేక, మూడింటిలో నేదోయొక్క దానియందు చేరియుండుట శుభప్రదము. మంత్రాంగసభను నిర్మించియున్న బృందముల సమ్మేళనము, తనకార్య