పుట:Adhunikarajyanga025633mbp.pdf/258

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బిల్లులు నిరాకరింపబడుట కుపయోగించెను. ప్రజాసామాన్యము, రాచకీయ అజ్ఞానమందుమున్గి తేలుచు, మంచిచెడ్డల నెరుంగక, తమ కగత్యమగు బిల్లులగూర్చి తగినంతజ్ఞానము బొందకుండుటయే యిందులకు కారణము. ఇటులనే "ఇనిషియేటివు" ద్వారా అనేక బిల్లులు బయలు దేరదీయబడినను, ప్రజలయొక్క "రిఫరెండము"ద్వారా నిరాకరింపబడెను. ప్రజలయం దెంతో ప్రచారమొనర్చి పార్టీలచే సంస్కరణావసరముల గుర్తింపచేసి, ప్రజాప్రతినిధులచే, ప్రవేశపెట్టబడబోవు బిల్లుల నంగీకరింపచేసి, తుదకు బిల్లుల ప్రవేశపెట్టి సభవారిచే సమ్మతింపజేయువరకే ఎన్నో వత్సరముల తరబడి సంస్కరణవాదులు కష్టనష్టములబొందవలసి వచ్చుచున్నది. దీనికితోడు, "రిఫరెండము"నందు ప్రజలందరిచే, ఆయా బిల్లుల నంగీకరింపజేయుట కెంతో బాధపడవలసి వచ్చుట వలన, శాసననిర్మాణము ఆపబడుటయు సంస్కరణములు అసాధ్యమగుటయు, అభివృద్ధి స్తంభించిపోవుటయు, తటస్థించును. ఇట్టి పరిస్థితులందు, శాసననిర్మాణకార్యమును మరింత కష్టతమ మొనర్చుటకు 'సెనెటుసభ' యవసరమా?

శాసననిర్మాణమునకై, సెనెటుసభ ప్రత్యేకముగా యవసరముకాకున్నను, సమ్మేళన, రాజ్యాంగములందు సభ్యరాష్ట్రముల యొక్క ప్రత్యేకతను సురక్షితపరచుటకై సెనెటుసభ యొకటుండుట మేలనియు, అందు వివిధరాష్ట్రముల