పుట:Adhunikarajyanga025633mbp.pdf/257

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వలయునన్న ప్రజాప్రతినిధిసభవారిచేగాని, వారి స్థాయిసంఘమువారిచేగాని, తగునట్లు పరిష్కరింపబడుట యుత్తమము. ఈ నియమమును జర్మను అమెరికారాష్ట్రముల రాజ్యాంగము లంగీకరించుచున్నవి.

ఇవ్విధముగా సకాలమున ప్రజాప్రతినిధిసభవారు బిల్లులు ప్రవేశపెట్టునట్టుచేయుటకు "ఇనిషియేటివు" ఆసభవారిచే నిర్మింపబడుబిల్లులు ప్రజాంగీకారము బొందునా, లేదా, యని పరీక్షించుటకు "రిఫరెండము" అను రెండు విధానముల నేర్పరచినపిమ్మట సభయందు ప్రవేశపెట్టబడిన బిల్లుల తగురీతి సంస్కరించి సవరించుటకు స్థాయిసంఘముల స్థాపించి ఆయాబిలులు ప్రజలయందు గోష్టులు, పత్రికాపక్ష ప్రచారములద్వారా ప్రచార మొనర్చిన తరువాత శాసననిర్మాణకార్య విధానము సంతృప్తికరముగా జరుపబడకుండునా? ఇన్ని సదుపాయముల నేర్పరచినపిమ్మటకూడ సెనెటుసభ యగత్యమా?

"రిఫరెండము"ను, "ఇనిషియేటివు" ను, చాలాకాలమునుండి స్విడ్జర్లండు ఉపయోగించుచున్నది. క్రిందటి ముప్పది సంవత్సరములందు, అనేక అమెరికను రాష్ట్రములుకూడ, ఈవిధానముల నంగీకరించినవి. "రిఫరెండము" ప్రజాప్రతినిధి సభవారికి చేయూతగానుండుటమారు సెనెటువారికే సహాయమొనర్చుచు, అనేక అవసరమగు, లాభకరమగు