పుట:Adhunikarajyanga025633mbp.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తానెట్లు ప్రజలధనమును ఖర్చిడుచున్నదో, ప్రజల ప్రతినిధులకు, ఎల్లప్పుడు సమాధానము చెప్పుచుండవలయును. అమెరికాయందు తప్ప తదితర రాజ్యాంగములందు, ప్రభుత్వపు అనుదినచర్యలగురించి పరీక్షించి, విచారించుటకు, తప్పొప్పుల విమర్శించుటకు, అవసరమగు మార్పుల సూచించుటకు, శాసనసభలకు అధికారము కల్గుచున్నది. ధనమిచ్చువారు, దానిని ఖర్చిడువారిపై పెత్తనముజేయుట భావ్యమే కదా! ఇతరుల ధనమును ప్రభుత్వము హెచ్చించుట కధికారమిచ్చు శాసనసభలు ఆధనము నెట్లు ప్రభుత్వ ముపయోగించుచున్నదో, జాగ్రత్తగా విచారించుచుండుట వానిధర్మమైయున్నది.

ప్రతిమంత్రివర్గమును, తనకు అవసరమగు ధనము, ఏయేకార్య నిర్వాహణమునకై, ఎంతెంత గావలయునో సూచించుచు, బడ్జెట్టును తయారుచేసి, శాసనసభలయొక్క ఆమోదమునకై ప్రచురించవలసియున్నది. శాసనసభలకట్టి బడ్జెట్టుల సవిస్తరముగా విచారించి, తగుమార్పుల కల్గించుట కధికారము కలదు. పైగా అట్లు బడ్జెట్టును భద్రముగా విమర్శించుట, శాసనసభల ధర్మమునై యున్నది.

ప్రభుత్వము, బడ్జెట్టుద్వారా, శాసనసభవారు తన ఖర్చులకై యొసంగిన ధనము నెట్లు ఖర్చిడుచున్నాదో శాసనసభలకు చూపెట్టుటవసరము. ప్రభుత్వపు వ్యయలెఖ్కల