పుట:Adhunikarajyanga025633mbp.pdf/227

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పరీక్షించుటకు, "పబ్లికు అక్కౌంట్సు కమిటీ"ని ప్రతిశాసనసభయు నిర్మించుచున్నది. ఈకమిటీవారు, ప్రభుత్వము తన కొసంగబడిన ధనమును సక్రమముగా, సవ్యముగా ఖర్చిడుచుండెనా లేదాయని పరీక్షించి తమనివేదికను శాసనసభలకు సమర్పించవలసియున్నది.

ప్రభుత్వము ఎప్పటికప్పుడు ఖర్చిడుచుండు ధనమును ఏయేగ్రాంటులనుండి ఏయేపనులకు బొక్కసమునుండి తీసుకొనుచున్నదో విచారించి, బడ్జెట్టుఆక్టు ననుసరించియే ప్రభుత్వము సమిష్టిధనము నుపయోగించునట్లు చేయుటకు "ఆడిటరుజనరలు" అను యుద్యోగి నేర్పరచవలయును. సమిష్టి ధనమునుండి ఎప్పటికప్పుడు ప్రభుత్వపు వివిధడిపార్టుమెంటులు కోరు ధనమును బడ్జెట్టుఆక్టు ననుసరించియే చెల్లింపబడునట్లు జూచుట యీ యుద్యోగునిధర్మము. ఈయుద్యోగి ప్రతివత్సరము క్రిందటివత్సరపు ప్రభుత్వపు ఖర్చులనుగురించి, తనకు తోచిన విమర్శనలజేర్చి ఒకనివేదికను శాసనసభవారి ముందుచర్చనీయార్థమై పెట్టవలెను. కనుక ఈతడు ఒకమారు తనపదవి బొందినపిమ్మట తనయుద్యోగ కాలాంతమువరకు ప్రభుత్వమునుండి స్వతంత్రత బొందియుండి యుండవలెను. కానిచో ప్రభుత్వచర్యల విమర్శింపజాలడుగదా?

ఈవిధముగ తాను ప్రజలతరపున ప్రభుత్వమున కొసంగిన ధనమును ప్రభుత్వము సక్రమముగా ఖర్చిడునట్లు