పుట:Adhunikarajyanga025633mbp.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వారు ప్రజలయందు ప్రచారముచేయుటకు శాసనసభ యుపయోగపడును. దేశమునం దెచ్చటనైనను మంత్రివర్గ పక్షాభిమానులు తమచర్యల సమర్థించుకొనుచు సభల జేయించవచ్చునుకాని, తమప్రత్యర్థులు తమ సమర్థనలకు సమాధానమివ్వగల్గు యవకాశముల కల్పించుట కష్టసాధ్యము. శాసనసభయం దట్లుగాక, మంత్రివర్గపుపక్షము ఎల్లప్పుడు ప్రత్యర్థిపక్షమున కెదురుగా ఆసీనులైయుండుటచే ఒకరుచెప్పిన విషయముల మరొకరు కాదనుటకు అవకాశముకలదు. ఇటులనే ప్రభుత్వమందున్న మంత్రివర్గముద్వారా ఏయేకష్టములు ప్రజలకు కల్గుచున్నవో వివరముగా తెల్పి, ఏయేనష్టదాయకమగు కార్యవిధానమును పొరపాటునగాని, బుద్ధిపూర్వకముగాగాని మంత్రివర్గ మవలంబించినదో జూపెట్టి, తమపక్షపు కార్యక్రమమును అవలంబించినచో, తామే మంత్రివర్గము నేర్పరచినచో, ఎటేట్టు ప్రజాక్షేమాభివృద్ధి కారకముగా ప్రవర్తించెడివారో మైనారిటీయందున్న ప్రతికక్షి వారు జూపెట్టుటకు శాసనసభ యవకాశ మొసంగును. వారి వాదమునకు తగు సమాధానమొసంగి, ప్రభుత్వపుచర్యలగూర్చి పూర్తివివరములదెల్పి ప్రజలకు సంతృప్తికల్గించుటకు మంత్రివర్గపుమెజారిటీకి యదనుకల్గును.


ప్రశ్నలద్వారా, తగు సమాధానముల బొందుచు, ఎప్పటికప్పుడు ప్రభుత్వపుచర్యలగురించి ప్రజలకు తగుసంజా