పుట:Adhunikarajyanga025633mbp.pdf/213

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యిషీ తెల్పుటకు శాసనసభ యుపకరించును. ప్రజలయందు ప్రచారితము కాదగు భావములగురించి తీర్మానము నొకటి ప్రవేశపెట్టి, దానిపై కల్గుచర్యలద్వారా శాసనసభయొక్క యభిప్రాయముల ప్రజలకు తెలియజేయనగును. ప్రజలయందు కొందరిచే అత్యంతముగా వాంఛితమగుచుండు సంఘసంస్కరణముల సంబంధించిన బిల్లులను శాసనసభయందు బ్రవేశపెట్టి, తగుచర్యలను వానిపై జరిపి, ప్రజాభిప్రాయమును సుముఖముగానో, విముఖముగానో, ఆయాసంస్కరణలపై, కల్గింప వీలగును. ఈవిధముగా అనుదినము శాసనసభయందు జరుగు చర్యలను, వినుటకు,, వానిగూర్చిచదువుటకు, ప్రజలకు సంపూర్ణస్వాతంత్ర్యముండదగును. కనుక శాసనసభయందు వివిధరాచకీయ కక్షలు తమతమరాచకీయ ప్రణాళికలగురించి చర్చించుచు తమతమ యభిప్రాయముల వెల్లడిచేయుచు, వివిధప్రాంతములందలి, వివిధజన సంఘములందలి యాశయముల ప్రకటించుచు, శాసనసభాసభ్యులు తమధర్మమును నెరపుచుండ దేశమందలి ప్రజలెల్లర కావృత్తాంతములు పత్రికలద్వారా శాసనసభాసభ్యులచేతను, వారి పార్టీలచేతను ప్రకటింపబడు కరపత్రములద్వారా తెలియవచ్చుచుండును. అనగా, దేశీయులెల్లరు ప్రేక్షకులైయుండ శాసనసభయను రంగమందు ప్రజాప్రతినిధులు తమధర్మమును నెరవేర్చుచుందురు. కనుక ప్రభుత్వచర్యల గురించియు