పుట:Adhunikarajyanga025633mbp.pdf/201

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


VI

ఎన్నికలు, శాసనసభాసభ్యత్వముల కన్నిటికి, ఎప్పుడుజరుగునో, ఒకనెల, రెండు నెలలకు ముందే ప్రకటించుట ప్రభుత్వధర్మము. అమెరికాయందు, ఫ్రాన్సునందును, ఎన్నికలు ఆరుమాసములకు జరుగుననగానే, రాచకీయపక్షములు తగుప్రయత్నముల జేయుటకు వీలు కల్గుచున్నది. జర్మనీ, ఇంగ్లాండునందట్లుగాక, ప్రెసిడెంటుయొక్కయు లేక రాజుయొక్కయు అనుమతిపై, శాసనసభ నంత మొందించుటకు, మంత్రివర్గమున కధికార మున్నదిగనుక, పెత్తనమందున్న మంత్రివర్గము, తనకధికారియగు శాసనసభవారు, తన కననుకూలమై, తనపెత్తనమును సాగనివ్వకున్నప్పుడు, ప్రజాభిప్రాయము తనకే సుముఖమైయున్నదని తోచినప్పుడు, అకస్మాత్తుగా "జనరలు ఎలెక్షను" దెచ్చిపెట్టవచ్చును. మరియు శాసనసభయందు (ఇంగ్లండులో పార్లమెంటు; రైష్‌టాగ్ జర్మనీయందు) తనకున్న ప్రాపకము చాలినంతగా లేకుండుచో, తానుచేయుచున్న పెత్తనము, అమలుజరుపుచున్న కార్యక్రమము ప్రజామోదము బడయుచుండుచో, తిరిగి ఎన్నికలు బెట్టినయెడల, హెచ్చుప్రాపకము శాసనసభయందుకల్గునను నమ్మకము మంత్రివర్గమునకు కల్గుచో, ఎవ్వరికి తెలియకుండగనే, ప్రతిపక్షమువారు, ఎన్నికలకు తయారుకాని, సమయమందు, ప్రజలు ఎన్నికలందెట్లు ప్రవర్తించ