పుట:Adhunikarajyanga025633mbp.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నగునో దీర్ఘముగా విచారించుకొనలేని యదనున, "జనరలు ఎలెక్షను"ను మంత్రివర్గము దెచ్చిపెట్టవచ్చును. ఇట్లు, ఇంగ్లండునందలి, మంత్రివర్గములు అనేకమారులు ప్రవర్తించెను. ఇందువలన, రాచకీయకక్షలు, ఎన్నికల నడపుటకు తగిన ధనము జేకూర్చుకొనలేకయు, ప్రచారముచేయుటకు సహాయులు లేకయు బాధనొందుట తటస్థించెను. ప్రజలకు, ఏపక్షమున కెట్లు వోటుచేయనగునో విచారించుకొను యవకాశము కలుగదాయెను. వార్తాపత్రికలకు, ప్రజలకు తగు సలహాల నిచ్చుటకు వీలు కలుగదాయెను. తగినంత ప్రచారము ప్రజలయందు కల్గించుటకు అభ్యర్ధులకు వీలు లేదయ్యెను. మొత్తముమీద, ప్రజాభిప్రాయమును సక్రమముగా, సంతృప్తికరముగా, తెలియపరచగల్గు, ప్రజాప్రతినిధులు అకస్మాత్తుగావచ్చు ఎన్నికలందు, యెన్నుకొనబడజాలరు. కనుక, "జనరలు యెలెక్షనులు" యెప్పుడువచ్చునో ప్రజలకు, ఒకటిరెండు నెలలకు ముందుగానే తెలియజేయుట భావ్యము.

యెన్నికలనడపు "పోలింగుఆఫీసరు"లు బాధ్యతకలవారై, న్యాయవర్తనులైనవారుగా నుండవలెను. ఒక జిల్లావారిని మరొకజిల్లాకు వేయుట, కొంతఖర్చునకు కారణమైనను, ఎన్నికలు సక్రమముగా జరుగుట కుపయోగమేమో విచారించుట భావ్యము. మనదేశమందు అమెరికాయందు