పుట:Adhunikarajyanga025633mbp.pdf/195

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఇట్టిపద్ధతిప్రకారము ఎన్నుకొనబడిన ఆమైనారిటీ సంఘముల ప్రతినిధులవలన, ఆయాసంఘముల కేమి ప్రత్యేకలాభములు కలుగనగునని కొందరు ప్రశ్నించవచ్చును. ప్రజలందరిక్షేమమును వృద్ధిపరచుటకై శాసనసభ యేర్పరచడినదిగనుక, ప్రతిసభ్యుడును, ప్రజలయందలి యేభాగమునకును యెట్టిఅన్యాయము జరుగకుండ, ప్రభుత్వపుచర్యలవలన ఎల్లరకు శ్రేయమొనగూడునట్లు జాగ్రత్తపడవలెను. ఇంతకుమించి ప్రత్యేకముగా మైనారిటీసంఘములకు వలయులాభమెల్ల తమతమఆచారవ్యవహారములు, సాంఘికమత సాంప్రదాయముల రక్షణపరచుకొనుటకు తగుహక్కుమాత్రమే! అట్టిహక్కుమాత్రమే! అట్టిహక్కును తదితరమతస్థులు, జాతీయులు, సంకుచితపరచకుండ, భంగపరుపకుండ జాగ్రత్తపడుట ఆయామతములకు, జాతులకుజెందిన సభ్యులొనర్చవలసిన కృత్యము. న్యాయరీత్యా, సభ్యుల మతములతో జాతులతో నిమిత్తము లేకుండగనే, అన్ని మతస్థుల జాతులయెడ ధర్మము నెరపుటయే ప్రతిసభ్యుని విధికృత్యమైనను, ఏయేమతస్థులకు సంబంధించిన విషయములు చర్చింపబడునో, ఆమతస్థులగు సభ్యులట్టి చర్యలయందు పాల్గొని తమమతస్వాతంత్ర్యముల గూర్చి పట్టుదల వహించుటలో నష్టములేకపోగా, లాభముచేకూరును.