పుట:Adhunikarajyanga025633mbp.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎన్నికలజరిపించుటలో వోటరు పోలింగుస్టేషనులకు రాగా, వారిచేత వోట్లను యిప్పించుటకు రెండు విధానములుకలవు. పురాతనకాలమందు (గ్రీసునందును, రోమునందును) పౌరులెల్లరు తమ యామోద వ్యతిరేకముల దెల్పుటకు తగు సమయములందు చేతులెత్తుచుండిరి. అటులనే, ఇంగ్లాండునందును పదు నెనిమిదవశతాబ్దమందు ఎన్నికలుజరుప బడుచుండెను. కాని, అట్లు బహిరంగప్రదేశములందు, వోటరులు బహిరంగముగా తమవోటులనిచ్చు సమయములందు వారిపై దౌర్జన్యముచేయువారు హెచ్చుచుండుటయు, వోటరులెవ్వరెవ్వరికి వోటులనిచ్చిరో తెలుసుకొనిన యభ్యర్థులు, వారిస్నేహితులు, వోటరుల హింసించబూనుకొనుచుండుటయు గలుగుటచే ఆబహిరంగమగు ఎన్నికపద్ధతిమాని, రహస్యపు "బాలెట్టుపెట్టె" పద్ధతిని ఇంగ్లాండునందు మొదలెట్టిరి. ఇప్పటి కాపద్ధతియే ప్రపంచమందంతట ప్రచారమునకు వచ్చెను. ఈపద్ధతిప్రకారము ప్రతివోటరును తన బాలెట్టు కాగితముపై తనకిష్టులగు అభ్యర్థులకు వారిపేరులకుముందుండుగళ్లలో (X) టిక్కుమార్కుబెట్టి, ఆకాగితమును మడచి బాలెట్టు పెట్టెయందు పడ వేయును. ఆవోటరు ఎవ్వరికి తన వోటునిచ్చెనో మరితరులకు తెలియుటకికవీలులేదు. ఇందువలన భూస్వాములు తమ కౌలుదారులపైగాని, రైతులు యజమానులు, తమ కూలివారిపైగాని, దౌర్జన్యముచేయు