పుట:Adhunikarajyanga025633mbp.pdf/146

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


న్నారు కాని, ఇప్పటికే వోటుహక్కు బొందియున్న పురుషులలో నధికసంఖ్యాకులకు సంపాదితమైయున్న విద్య, అనుభవము, కార్యనిర్వహణశక్తి, స్త్రీలకుమాత్రము లోపించుచున్నదని చెప్ప సాహసింపలేకున్నారు. కారణమేమమ నిర్బంధ ప్రారంభవిద్య నందరు బొందుచు, వార్తాపత్రికాపఠన మందరు గావించుచు, రాజ్యాంగవ్యవహారముల నెల్లరు గమనించుచున్నంతవరకు స్త్రీ పురుషభేదములు మాత్రము రాచకార్య నిర్వహణమునందు, స్త్రీలకువోటుహక్కు యివ్వరానంత విపరీత తారతమ్యత కల్గించుట దు స్తరము, ధర్మవిరుద్ధము. మనదేశమందును, స్త్రీలకు వోటుహక్కు ప్రసాదించరాదను వారు అరుదగుచున్నారు. ఘోషాపద్ధతిని బొందిన, మహమ్మదీయులు ఈ హక్కు తమస్త్రీలకు ప్రసాదించుటకు అనుమతించుట లేదు కాని, వారి స్త్రీలయందలి నాయకురాండ్రు వారినాయకులు కొందరు వోటుహక్కు యెల్లరకు నొసగబడవలెననుచున్నారు. లోధియను కమిటీ వారిసూచనలప్రకారము స్త్రీలును, పురుషులతోబాటు క్రమకమముగా సంపూర్ణ వోటుహక్కు పొందనగునని తేలుచున్నది.

స్త్రీపురుషులను భేదముల గమనించుట పాడిగాకున్నను, ఆస్థిగలవారు, ఆస్థిలేనివారను తారతమ్యత గమనించుటగత్యమని కొందరు వాదించుచుండిరి. ఆస్థిగలవారన్న, ఎంతయాస్థిపరులను ప్రశ్న బయలుదేరును. ఇంగ్లాండునందు