పుట:Adhunikarajyanga025633mbp.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీ. శ. 1832 వరకు, 10 పొన్లు భూమిశిస్తు చెల్లించువారే వోటుహక్కు పొందకల్గిరి. పిమ్మట 1867 సంవత్సరమునందు 12 పౌన్లు శిస్తుచెల్లించు వారందరకి వోటుహక్కు ప్రసాదించబడెను. తుదకు 1884 నందు, ఆస్థికల్గియుండుట, శిస్తులచెల్లించుట యనుభేదముల గమనించుట మాని, యుక్త వయస్కులగు పురుషులందరికి, వోటుహక్కు యివ్వబడెను. మనదేశమందుగూడ, 1919 ఆక్టుప్రకారము, పదిరూపాయల లాండురెవిన్యూ చెల్లించువారు కౌన్సిలునకు, ఏబదిరూపాయల భూమిశిస్తు చెల్లించువారు అస్సెంబ్లీకి, వోటుహక్కు బొందిరి. కాని యిప్పటి లోధియనుకమిటీ సూచనలప్రకారము, మద్రాసులోకలుబోర్డ్సు ఆక్టుప్రకారము, నామమాత్రపు శిస్తుచెల్లించువారు, భూములను మక్తాకు సేద్యముచేయువారుకూడ వోటుహక్కు బొందనగును. అనగా, సంవత్సరమునకు నాల్గణాలశిస్తు చెల్లించువారెల్లరు వోటుహక్కు బొందగల్గుదురు.

ఇట్లు నామమాత్రపు శిస్తుచెల్లించువారు (మనలోకలు బోర్డునందును, ఇంగ్లాండులో 1867 వరకును) వోటుహక్కుబొందుచుండ, మిగిలిన నిర్ధనులగువారెల్లరు, వోటును బొందజాలకుండుట న్యాయమా ? వోటును సంపాదించుకొన గల్గినవారికిని, వోటును బొందజాలనివారికిని, విద్యయందుగాని, అనుభవమందు కాని, రాచకీయవిజ్ఞానమందు కాని,