పుట:Adhunikarajyanga025633mbp.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రు, వారిమంత్రివర్గము, వారిప్రధానరాజ్యాధికారియుమాత్రమే తగినవారు. అమెరికాయందు సుప్రీముకోర్టువారి కీహక్కు నొసంగుటవలన, అమెరికా ప్రజలనేక యిబ్బందులకు లోనగుచున్నారు. స్విట్జర్లాండు, జర్మనీ, ఆస్ట్రియాల పద్ధతియే హెచ్చుసంతృప్తి కల్గించునని తోచుచున్నది.

ఐక్యరాజ్యాంగమందు ప్రభుత్వపు మూడు అంగములు తమతమ విధికృత్య నిర్వహణమందు స్వతంత్రత వహించుచు, పరస్పరముగా సహకారమొనర్చు కొనవచ్చునని మూడవప్రకరణమున జూచితిమి. ఆసూత్రముననుసరించియే, సమ్మేళన రాజ్యాంగమందును, ప్రభుత్వపు వివిధాంగములు తమ కార్యక్రమమును సాగింపవచ్చును. కాని కొందరు, ఆధునిక యుగమందలి ప్రధానమును, ప్రధమసమ్మేళన రాజ్యాంగమునకు అమెరికాసంయుక్తరాష్ట్ర రాజ్యాంగమునం దీమూడు భాగములు పరస్పరముగా వేరుబడి, స్వతంత్రమునొందియున్నవే! అటులనే తదితర సమ్మేళనరాజ్యాంగములందును యేర్పరచుట శుభప్రదము కాదా? యని యోచింపవచ్చును. కాని, అమెరికాయం దీఅనర్ధకమగు యేర్పాటును, రాజ్యాంగనిర్మాతలు బ్రిటిషురాజ్యాంగమునుగురించి భ్రమజెంది యుండినవారై స్థాపించిరి కనుకను, ఈయేర్పాటువలన అమెరికారాజ్యాంగము అసంతృప్తికరమగు పర్యవసానముల కల్గించుచున్నది గనుకను, దీనికి వ్యతిరేకమగు రాచకీయానుభవమున సక్రమమైనదని