పుట:Adhunikarajyanga025633mbp.pdf/137

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


తేల్చబడిన ఇంగ్లీషుయేర్పాటు లాభదాయకము గనుకను, అమెరికాయందువలె, ప్రభుత్వపు వివిధాంగములు పరస్పరముగా వేరు వేరు చేయుట తగదు.

ఐక్యరాజ్యాంగములందు, శాసనసభయే ప్రధానమైన ప్రభుత్వాంగమై యున్నది. కొన్ని రాజ్యాంగములందు, "రెఫరెండము"

న్యాయస్థానములు ప్రధాన
స్థానము పొందునా ?

ద్వారా, ముఖ్యమగు ప్రతిబిల్లును ప్రజల యామోదమునకు తేవలసియున్నను, ప్రజలే రాజ్యాంగవిధానపు చట్టములకు సవరణలను, సాధారణ శాసనముల ప్రతిపాదించు యధికారము కల్గియుండినను, సాధారణముగా శాసనసభలే అవసరమగు శాసననిర్మాణ కార్యక్రమమును నడపుచుండును. ఐక్యరాజ్యాంగముల శాసనసభలయొక్క శాసనములను చట్టవిరుద్ధమని తీర్మానించుయధికార మెవరికిని లేకున్నది.

అమెరికాయందుతప్ప ప్రజాప్రతినిధి సభలకు బాధ్యతవహించు మంత్రివర్గములు మిగతా ప్రజాస్వామిక దేశములందు, ముఖ్యముగా, ఐక్యరాజ్యాంగములందున ఏర్పడియుండుట వలన, ప్రజాప్రతినిధిసభలే, రాజ్యాంగ సంస్థలన్నిటియందును ప్రాధాన్యమగు స్థానమలంకరించుచున్నవి.

కాని, సమ్మేళనరాజ్యాంగములం దీపరిస్థితులు మారినవి. అచ్చట, శాసనసభయొక్క ప్రాముఖ్యత తగ్గుచున్నది. న్యాయస్థానములు, అందును సుప్రీముకోర్టు ప్రధానస్థాన