పుట:Abraham Lincoln (Telugu).pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సామాన్యబాలురకు మంచిభోజన మనిన నెంతప్రీతియో యాబ్రహామునకు మంచి పుస్తుక మన్న నంత ప్రీతి. బహుకాలము దన మూడుపుస్తకములె చదువుచుండు నితని కీ పుస్తుక మొక నూతన సంతోష మొసంగెను. పట్టినది విడువక దాని నొక్కమారు చదివి రెండవమారు చదువునప్పటికి మఱొండు గ్రంథ మతనికి బ్రాప్తించెను. అది 'ఈసాఫ్స్ ఫేభిల్స'ను నీతికథామంజరి. దీని నతడు పలుమారు చదివెను. చదివిన యనేకభాగము లతని శిరోపేటికయం దట్టె నిలిచి పోయెను. కథల జదివి నీతుల స్మరించుటయం దతని మనము సంపూర్ణముగ మునిగి యుండెను. ఆ నీతుల నతడు ప్రాణమున్నంతకాలము జ్ఞాపక ముంచుకొని తదనుగుణముగ బ్రవర్తించుచుండెను.

ఇంతయానంద మిచ్చు పుస్తుకద్వయంబు చేదొరకిన బని పాటలమీద నతనికి దృష్టి గొంచము దక్కు వాయె ననిన నేమి వింత. తెలియనివా రీ లోపమును సోమరితన మని తలతురు. ఆప్రకారము యతని తండ్రి తలచి యతని పై గోపము సూపుచు వచ్చెను. విద్యావంతులు గాక విద్యవలని ప్రయోజనముల సంపూర్ణముగ నెఱుంగని మోటువారి కిది సహజము గదా. మన దేశమున నిక్కాలమున ననేకులు దలిదండ్రులు దమ పుత్రులకు బుత్రికలకు: జదు వనవసర మనియు జదువ