పుట:Abraham Lincoln (Telugu).pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నారంభించినవారు సోమరు లగుదురనియు నెన్నుచుందురు. ఇదెల్లయు దురభిప్రాయము. విద్య గడించుట యొకపనియనియు, దాన బుద్ధి సొరజేసి పాటుపడెడువారు సోమరులుగాక మహా గొప్పవా రనియు మనము నమ్మవలెను. విద్యయొక్క యావస్యకత నిట వ్రాయుటకు వీలుగాదు. ఆబ్రహాము లింకనె దీనికి దార్కాణ మగుగాక. విద్యాధికత హీనజన్ముల ననేకుల కలవడి యున్నది. అలవడ గలదు. సమర్ధతకును జన్మమునకును సంబంధము లేదు. ఎవ్వడు పాటపడునొ వాడు గొప్పవాడు గాగలడు. పరమేశ్వరుడు నిష్పక్షపాతి. తన సృజించిన జనులంద ఱతని కొక్కొటియ. ఎవడు గష్టించి సుగుణసంపత్తి జేర్చుకొని తన పాదారవిందముల గాంచు నతడ దనకు బ్రియపుత్రు డని దైవము ప్రసన్ను డగును.

తండ్రిగోపము సూచించినను ఆబ్రహాము వినయమున 'నిదె వచ్చితిని. త్వరితగతి బ్రయత్నించి యెంతపని యున్నను దీర్చెదను. త్రుటికాలమున నా చదువు ముగించి వచ్చెద' నని తండ్రిని కొంత యోదార్చుచుండును. తండ్రి దన గుమారుడు విద్యాపేక్షచే దన యుత్తరవుల నెరవేర్చుటయం దలసత సూపుచుండె నని తెలిసికొనలేక యాగ్రహము పూనినను బ్రేమాతిశయంబున నా యాగ్రహ మంత వెలువడ జేయుచుంట లేదు. ఆబ్రహా మింటెతలుపులమీదను గోడలమీ