పుట:Abraham Lincoln (Telugu).pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యున్న విషయమునే మొదట నడిగెను. జాబు చేరిన దనుటకు లక్ష్యము దనకండ్ల కగుపడుచుండినను దా జేసిన కార్యము ఫలించిన దనునిశ్చయ మెఱుగ నతడు దడబడు చుండెను.

"నీ యుత్తరమా? మీ తండ్రిగారిది నాకు జేరె." తంద్రి నామ మిడి వ్రాసిన విషయము స్మరించుట కాబ్రహామున కవకాశము లేకపోయెను.

"నేను వ్రాసితిని."

"నీవా వ్రాసితివి?"

"అవును తండ్రిగారు వ్రాయలేరుగా."

"అవునవును. నా కిపుడు స్మరణకు వచ్చినది. నీతండ్రి వ్రాయలేరు. కావున నీవే వ్రాసితివే? బాలురలో నీతెఱంగున ననేకులు వ్రాయజాలరు సుమా."

"అదియ నా ప్రథమ ప్రయత్నము."

"ఓహో! కడులెస్స. నీ మొదటి కమ్మయా యిది? నీవద్దాన లోపము లున్నవని జంక నవశ్యము లేదు."

ఈవిధమున సల్లాపము లాడుచు వారు లింకనుల గుడిసె సమీపించుచుండిరి. ఆబ్రహాము గుఱ్ఱముప్రక్కన జరుగిడు చుండెను. పార్సన్ అతనిపై గరుణావలోకంబుల సారించి భాషించుచు సవారిసేయుచుండెను. ఇలు గాన్పించినతోడనె