పుట:Abraham Lincoln (Telugu).pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లింకనుతండ్రి దన పుత్రుని యాచరణను గుఱించి యితరులకు బొంగిపొంగి చెప్పుచుండును. వారును సంతసంబున నతని బొగడుచుందురు. ఆ ప్రదేశమునకు నిరుగుపొరుగున జాలదూరమువఱకు గల పెద్దవారలలో నొక పాతికమందికి గూడ వ్రాయు నేర్పులేదు. కావున నాబాలకున కంతపని చేయు శక్తిగల్గుట మహాద్భుతముగ నుండెను. ఆవార్త చుట్టు ప్రక్కల వ్యాపింప దత్ఫలముగ ననేకు లాబ్రహాము లింకను కడకఱిగి తమ కుత్తరముల వ్రాసి యియ్యమని ప్రార్థింప మొదలిడిరి. అతడును శైశవము నుండి తనవల్ల నగు మే లితరులకు లే దనువాడు గాడు. ఇతరుల కోరికల దన శక్తికొలది నెరవేర్ప నెప్పుడు బ్రయత్నించుచుండును. అట్లగుట బహుకాలము దమ బంధుమిత్రుల క్షేమసమాచారములు వినని దూరదేశీయు లెల్ల నాబ్రహాము వ్రాయ గలిగినందున నెడనెడ దమవారినుండి పత్రికల నందుకొను భాగ్య మనుభవింప గనిరి. ఉత్తరముల వ్రాసియిచ్చు టతనికొక బరువుగ దోచుట మాని యాహ్లాదకరముగ బొడగట్టుచుండెను.

అతని ప్రధమపత్రము చేరి మూడుమాసములమీదట పార్సన్‌గా రేగుదెంచిరి. అపు డాబి యింటికి మూడు మైళ్లు దూరమున మెలగుచుండి యాపురోహితునింగాంచి సంతసించి "అయ్యా! నా కమ్మ మీకందెనే" యని తనమనసున నిండి