పుట:Abraham Lincoln (Telugu).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఖలుడు బహుకాలము నిలువడుగదా! బానిసంబున కంత్యకాల మాసన్నమై మన కథానాయకుని దనతోడనకొని పరలోకమున కరిగెను. అంతటితో యునైటెడ్‌స్టేట్సు సంయుక్త రాష్ట్రత శిలాశాశ్వత మాయెను.

ఈసంయుక్తరాష్ట్రపు సార్వభౌమత్వము మూడుపట్ల నివసించెడిని.

!. సీమ ప్రతినిధిసభ:- ఆఱుసంవత్సరముల కొకమారు ప్రతి సీమయందలి చట్టనిర్మాణ సభవా రాప్రదేశ మందలి ప్రాముఖ్యు లిద్దఱి నేర్చి యీ సభకు బంపుచుందురు. వీరు 30 సంవత్సరములకు పైబడి లోకానుభవము గలవారుగా నుందురు. వీరి యభిప్రాయములు జనసామాన్యుల మేలు ననుసరించి స్వబుద్ధిజనితము లై యుండును.

2. ప్రజాప్రతినిధి సభ:- సీమచట్ట నిర్మాణ సభకు బ్రతి నిధుల నేర్పఱచువారే వీరిని నిర్వచింతురు. సంయుక్త రాష్ట్రపు జట్టదిట్టము లన్నియు నీరెండు సభల మూలముననే యేర్పడవలెను.

3. దేశాధ్యక్షుడు:- ఆ చట్టదిట్టముల చెల్లించు సర్వాధికారము దేశాద్యక్షునికి గలదు. అతడు చట్టదిట్టములు నిర్మింప బడుతరి వానికంగీకరింప వలెను. అతని యంగీకారము లేనియెడల నావిషయము మఱల పైసభల