పుట:Abraham Lincoln (Telugu).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యందు జర్చింపబడి మూట రెందుపాళ్లు సమ్మతుల బడసిననేకాని రాష్ట్రమున జెల్లదు. దేశాధ్యక్షుడు నాలుగుసంవత్సరముల కొకమారు జనసాన్యులచే బేర్కొనబడు నిర్వాచకుల సమ్మతుల వలన నేమింప బడును. అతడా రాష్ట్రమున జననమంది యుండవలయును. మప్పదియైదు సంవత్సరములకు లోపుగా నుండగూడదు. ఒక్క మతమునకు జేరియుండవలెనను నిర్బంధము లేదు. తా నధికారమున నుండునంతకాలము స్వచ్ఛందవృత్తి రాజ్యభారము నిర్వహింప వచ్చును. విదేశీయులతో యుద్ధము, సంధిమొదలుగా గల్గువిషయముల నిర్ధారణ సేసికొనుటయందును దేశమునందలి యుత్తమస్థానముల కితరుల నేర్పఱచుటయందును మాత్రమ యతడు సీమ ప్రతినిధి సభకు లోబడి యుండవలయును. ఈ పదవిని గుఱించి యుపన్యసించుచు బ్రైసను మహాచరిత్రకారుడు లోకమున నెల్ల మహా మతాచార్యుల స్థానమునకు గుడిచేయి కెడమహస్తము బోలు మహోత్కృష్టపద విది దక్క వేరొండులేదని నుడివియునాడు. ఆంగలోదేశపు రాజును హిందూదేశపు జక్రవర్తియు నగు నా మహాపురుషుడును ఆసియా యైరోపాఖండముల నుత్తరభాగమంతయు దనస్వాదీనమున నుంచుకొని ప్రజల గడగడవడంకం