పుట:Abraham Lincoln (Telugu).pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లింకను జంపబడె ననువార్త యునైటెడ్ రాష్ట్రమున నంతయు రెండవరోజుదయమున దెలియనాయెను. పట్టణపట్టణ మందును, బల్లియపల్లియయందును, దు:ఖ తిమిరములు దట్టము లయ్యెను. అంగళ్లయందలి నలుపువస్త్రములెల్లయు నుపయోగింపబడియెను*ప్రతి మనుజుడు వేరొక్కరుని దనస్నేహితుని జూచినపుడెల్ల "ఘోరముఘోర మ"ని విలపించుట విన నాయెను. జనులు సభలు చేర్చి తమ దు:ఖమును వెల్లడించిరి. దేవాలయముల ననేకులు గుమిగూడి దైవము లింకను జీవమును సుగతిం జేర్చుగాతమని ప్రార్థించిరి.

ఇక నీగ్రోల స్థితి యంటిమే యూహింపం గూడజాలము. తండ్రి గతుడైన శిశువు లెట్లు విలపింతు రట్లు లింకను చావునకు వీరు విలపించిరి. ఎచ్చట జూచినను నీ నల్లవారు దు:ఖముచే ముఖములు వాంచి చేతులు పిసికికొనుచు 'దైవమా' 'దైవమా' 'దైవమా' యని మొఱ్ఱలిడుచు నేరు పలుకరించినను బలుకనేరక వీధులంబడి పోవుచుంటయ ననేకు లొక్కటిగజేరి మోకాళ్లపై నొరగి దేవునికి దమ యార్తహృదయముల నివేదించుటయు గాన నయ్యెను. ______________________________________________________________

  • పాశ్చాత్యులు దు:ఖము గనుపఱుప నల్లవస్త్రముల ధరింతురు. తమగృహాదుల నలుపున గప్పుదురు. వార్తాపత్రికలలోను జాబులలోను గూడ గాగితము చుట్టును నల్లగీతల ముద్రింతురు.